Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా తొలి పరీక్ష విజయవంతం
బీజింగ్: చైనా తయారు చేసిన ప్రపంచంలోనే అతి పెద్ద ఉభయచర విమానం తొలి పరీక్ష శనివారం పూర్తయింది. నీటిలోనూ నేల మీద దిగేలా చైనా తయారు చేసిన అతి పెద్ద ఉభయచర విమానం ఏజీ600 విమానం తొలి పరీక్ష విజయవంతమైంది. శనివారం హుబే ప్రావిన్స్‌లోని జింగ్మెన్ ప్రాంతంలోని ఓ రిజర్వాయర్ నుంచి టేకాఫ్ అయిన విమానం 15 నిమిషాలపాటు గాలిలో తిరిగి మళ్లీ నీటిలో విజయవంతంగా దిగిందని చైనా డైలీ మీడియా సంస్థ వెల్లడించింది. గత డిసెంబరు నుంచి ఈ విమానానికి ప్రాథమిక పరీక్షలు జరుపుతూ వస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉభయచర విమానాన్ని చైనాకు చెందిన విమానయాన సంస్థ ఏవియేషన్ ఇండిస్టీ కార్పొరేషన్ ఆఫ్ చైనా సంస్థ తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన నాలుగు టర్బోప్రాప్ తరహా ఇంజిన్లతో ఇది పనిచేస్తుంది. సముద్రాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, తీర ప్రాంతాల్లో గస్తీ వంటి ఇతర అవసరాలకు ఈ తరహా విమానాలను వినియోగించనున్నారు.