Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాక్ అధ్యక్షుడు బర్హాం
బాగ్దాద్: ఇరాక్ రాజ్యాంగ నిబంధనల పరిధిలోనే తాను బ్రిటన్ పౌరసత్వాన్ని వదులుకున్నానని ఇరాక్ అధ్యక్షుడు బర్హాం సాలీ చెప్పారు. ఇందుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తయిందని సాలీ కార్యాలయ ప్రతినిధి లక్మన్ అల్ ఫెయిలీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇరాక్ రాజ్యాంగంలోని 18వ అధికరణ మేరకు అధ్యక్షుడు సాలీ తన బ్రిటన్ పౌరసత్వాన్ని వదులుకున్నారని ఆయన వివరించారు. దేశంలో ఉన్నత స్థాయి రాజ్యాంగ పదవుల్లో వున్న ప్రతిఒక్కరూ ఇతరదేశాల పౌరసత్వాన్ని వదులుకోవాలని రాజ్యాంగంలోని 18వ అధికరణ నిర్దేశిస్తోందని ఆయన వివరించారు.