Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటు ముట్టడికి యత్నం
- ప్రదర్శనకారులపై నిర్బంధం
పారిస్: ఫ్రాన్స్‌లో మాక్రాన్ సర్కారుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న 'ఎల్లో వెస్ట్' ప్రదర్శనలు 13 వారాలు దాటి 14వ వారంలోకి ప్రవేశించాయి. ప్రతి శనివారం నిర్వహించే ఈ నిరసనల్లో భాగంగా పారిస్‌లోని జాతీయ అసెంబ్లీ ముట్టడికి ఆందోళనకారులు యత్నించగా ప్రభుత్వం తీవ్ర నిర్బంధకాండను ప్రయోగించింది. ఎల్లో వెస్ట్ ఉద్యమం 13 వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలు హోరెత్తాయి. దేశవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన ప్రదర్శనల్లో దాదాపు 51,400 మంది దాకా పాల్గొన్నట్టు ఫ్రాన్స్ హోం మంత్రిత్వశాఖ అంచనా వేసింది. గత నవంబర్‌లో ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న మాక్రాన్ ప్రభుత్వ వ్యతిరేక రూపం తీసుకుంది. ఇంధన ధరలకు ఆజ్యం పోస్తున్న ఆర్థిక సంస్కరణలను ఎల్లో వెస్ట్స్ ఉద్యమ ప్రభావంతో మాక్రాన్ కొంత సడలించినప్పటికీ, ప్రభుత్వ పొదుపు చర్యలపై ప్రజాగ్రహం చల్లారలేదు. మాక్రాన్ సర్కారు ప్రతిపాదిస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణలపై ప్రజల్లో నానాటికీ వ్యతిరేకత పెరుగుతున్నది.