Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాత్కాలిక ఒప్పందాన్ని ప్రకటించిన కాంగ్రెస్
వాషింగ్టన్ : ఆర్థిక మాంద్యంతో ట్రంప్ ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించకుండా నివారించేందుకు అమెరికన్ కాంగ్రెస్ సోమవారం తాత్కాలిక ఒప్పందాన్ని ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా మళ్ళీ వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు లేకుండా వుండే పరిస్థితిని రానివ్వరాదని భావించి ఈ చర్య తీసుకుంది. సరిహద్దు గోడ నిర్మాణానికి తొలుత ట్రంప్ అభ్యర్ధించిన 600కోట్లకు పైగా డాలర్ల మొత్తాన్ని ఈ ఒప్పందం కింద ఇవ్వడానికి అనుమతించకపోయినా ఇమ్మిగ్రేషన్ నియంత్రణలను బలోపేతం చేస్తారని ఆశిస్తూ రిపబ్లికన్లకు కొన్ని రాయితీలు ఇచ్చేందుకు అనుమతించనుంది. ఇమ్మిగ్రెంట్ల నిర్బంధాలను పరిమితం చేయాలన్న డెమోక్రాట్ల డిమాండ్‌పై చర్చలకు ముందుగా కాంగ్రెస్ సభ్యులు రిపబ్లికన్లతో కొంతమేరకు రాజీకి వచ్చారు. 600కోట్ల డాలర్ల వ్యయంతో 200మైళ్ళ పొడవునా ట్రంప్ వేయాలనుకున్న ఉక్కు కంచె నిర్మాణానికి బదులుగా 137.5కోట్ల డాలర్ల వ్యయంతో 55మైళ్ళ మేరా సాధారణ తరహా కంచె వేయడానికి కాంగ్రెస్ సభ్యులు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే ఈ వనరులను ఇప్పటికే వున్న సరిహద్దు కంచెను విస్తరించడానికి ఉపయోగిస్తారా లేదా వున్నదాన్ని పటిష్టపరుస్తారా అన్నది స్పష్టం కాలేదు. డెమోక్రాట్లు కూడా తమ వంతుగా వలసవాదుల సంఖ్యను నియంత్రించాలన్న అంశంపై వెనక్కితగ్గారు.