Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా బెదిరింపులు
- భారత్ సహా వెనిజులాకు మద్దతిచ్చే దేశాలకు..
- ఇది నియంతృత్వం : వెనిజులా
వాషింగ్టన్ : వెనిజులా చమురును కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. కాగా అమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న వెనిజులా మరింత చమురు ఎగుమతి కోసం భారత్ వైపు దృష్టి సారించింది. అమెరికా ఆంక్షలను లెక్క చేయక వెనిజులా చమురును కొనుగోలు చేస్తు న్న భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ బెదిరింపులకు దిగారు. కాగా దీనిపై వెనిజులా విదేశాంగ మంత్రి జార్జి అల్బర్టో స్పందిస్తూ, ప్రపంచ దేశాలపై నియంతృత్వం విధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నమిదని వ్యాఖ్యానించారు. వెనిజులా సహజవనరులను కొల్లగొడుతున్న అధ్యక్షుడు నికొలస్ మదురోకు మద్దతుగా నిలిచే దేశాలు, సంస్థలను మర్చిపోబోమని బోల్టన్ అంతకు ముందు ట్వీట్ చేశారు. భారత్‌కు మరింత చమురును విక్రయిస్తామని కోరేందుకు వెనిజులా చమురు శాఖ మంత్రి మాన్యుయల్ క్వెవెడో భారత్ సందర్శిస్తున్నట్టు వచ్చిన వార్తా కథనాన్ని కూడా ఆయన ట్విట్టర్లో ప్రదర్శించారు. వెనిజులా ప్రజల ఆస్తులను పరిరక్షించడానికి, ఇందుకోసం అన్ని దేశాలను ఒక్క తాటిపైకి తీసుకురావడానికి అమెరికా కృషి చేస్తుందని చెప్పారు.