Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాసలో క్యూబా పునరుద్ఘాటన
ఐక్యరాజ్య సమితి : పాలస్తీనాకు, పాలస్తీనియుల హక్కులకు పూర్తి స్థాయి గుర్తింపు సాధించేందుకు నిజమైన శాంతి క్రమం కోసం కృషిని కొనసాగిస్తానని ఐక్యరాజ్య సమితిలో క్యూబా పునరుద్ఘాటించింది. ఐక్యరాజ్య సమితిలో క్యూబా శాశ్వత ప్రతినిధి అనా సిల్వియా రొడ్రిగజ్ మాట్లాడుతూ, ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇటీవల జరిగిన సంఘటనలు అక్కడ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించడం లేదని అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పాలస్తీనా పరిష్కారానికి ఇస్తున్న మద్దతును ప్రముఖంగా ప్రస్తావించారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న పాలస్తీనా వివాదం వల్ల అంతర్జా తీయ శాంతి, భద్రతలు ప్రభావితమవుతున్నాయని, వీరోచితులైన పాలస్తీనా ప్రజలు బాధితులుగా మిగిలిపోతున్నారని అన్నారు. పాలస్తీనా సార్వభౌమా ధికారం, బయటివారి జోక్యం లేకుండా స్వయం నిర్ణయాధికార హక్కును సమర్ధించారు. తమ ఇళ్ళకు తిరిగివచ్చే హక్కు పాలస్తీనియన్లకు వుందన్నారు.