Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 మంది మృతి, 50 మందికి గాయాలు
ఢాకా : బంగ్లాదేశ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెంది న నలుగురు సభ్యులు ఉన్నారు. 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రు లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ....చిట్టగాంగ్ నగరంలో భేరా ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది సజీవ దహనమ య్యారు. 50 మంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో దాదాపు 200 మంది నిరుపేదలు డేరాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఓ ఇంట్లో చెలరేగిన మంటలు క్రమక్రమంగా ఇతర ఇండ్లకు దావానలంలా వ్యాపిం చాయి. దీంతో,పలు ఇండ్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం సంభవిం చిన సమయంలో చుట్టుపక్కల నివసిస్తున్నవారంతా అప్రమత్తమై ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్టుసర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.