Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు విమానాలు రద్దు
కొలరాడో: అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల వల్ల కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మంచు కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. స్కూళ్లు, వ్యాపారసముదాయాలు మూతబ డ్డాయి. కొన్ని చోట్ల మంచుతో పాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొన్ని లక్షల కుటుంబాలు చీకటిలో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుఫానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుఫానును 'బాంబ్ తుఫాను'గా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢకొీన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. మంచు కారణంగా కొలరాడోలోని డెన్వర్ ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇండ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆస్పత్రికి తరలించారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.