Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాక్రాన్ చర్యలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున నిరసనలు
పారిస్: దాదాపు ఐదు నెలలుగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సామాజిక సంక్షోభానికి తెరదించేందుకు అధ్యక్షుడు మాక్రాన్ ప్రతిపాదిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా యెల్లోవెస్ట్స్ ఆందోళనకారులు శనివారం నుంచి తమ ఆందోళనను ఉధృతం చేశారు. సామాజిక సంక్షోభానికి తెరదించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యక్షుడు మక్రాన్ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చర్చలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో జరిగిన విశ్లేషణల ఆధారంగా ఆయన సంక్షోభ పరిష్కారానికి అవసరమైన చర్యలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబందించిన ప్రతిపాదనలు మీడియా వార్తా కథనాలలో వెలువడుతుండటంతో వీటిని వ్యతిరేకిస్తూ యెల్లోవెస్ట్స్ ఆందోళనకారులు తమ నిరసనలను ఉధృతం చేశారు. గత వారంలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో 31 వేల మంది పాల్గొన్నట్టు ఫ్రాన్స్ హోం మంత్రిత్వశాఖ అంచనా వేసింది.