Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుండగుడి అరెస్ట్
న్యూయార్క్ : గ్యాసోలిన్ క్యాన్లతో సెయింట్ ప్యాట్రిక్స్ చర్చిలోకి చొరబడిన దుండగుడిని అరెస్ట్ చేసినట్టు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రెండు క్యాన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. న్యూయార్క్ డీసీపీ జాన్ మిల్లర్ తెలిపిన వివరాల ప్రకారం...సెయింట్ ప్యాట్రిక్ చర్చిలోకి ఓ దుండగుడు గ్యాసోలిన్ క్యాన్లతో చొరబడ్డాడు. చర్చిలో ప్రార్థనకు వచ్చిన భక్తులు నిందితున్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు డీసీపీ తెలిపారు. కాగా, 1878లో ప్రారంభమైన సెయింట్ ప్యాట్రిక్స్ చర్చి నిర్మాణం 1880లో పూర్తయింది.