Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయ విచారణ అడ్డుకున్నారని 'మ్యూలర్' నివేదిక
- అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణ
- 'అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం'పై ముగిసిన విచారణ
వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందా? లేదా? అన్నదానిపై విడుదలైన 'మ్యూలర్' నివేదిక అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణ ముందుకు సాగకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో అడ్డంకులు సృష్టిం చారనీ, అధ్యక్షుడిగా అధికారాన్ని దుర్విని యోగం చేశారనీ 'మ్యూలర్ కమిషన్' పలు ఆరోపణలు చేసింది. ఈనేపథ్యంలో అధ్యక్షు డు ట్రంప్ న్యాయ విచారణను అడ్డుకు న్నారనే దానిపై అనుమానాలు బలపడ్డాయి. న్యాయ విచారణ అడ్డుకొని ట్రంప్ నేరం చేశారా? లేదా? అన్నది నిర్ణయాల్సింది 'కాంగ్రెస్' (పార్లమెంట్) మాత్రమేనని మ్యూలర్ స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారనీ, అధ్యక్షుడు ట్రంప్ అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై చట్ట ప్రకారం కాంగ్రెస్ విచారణ చేయవచ్చుననీ నివేదికలో పేర్కొన్నారు. దాదాపు 22 నెలలపాటు విచారణ జరిపి 448 పేజీలతో 'మ్యూలర్' నేతృత్వంలోని ప్రత్యేక విచారణ కౌన్సిల్ గురువారం నివేదిక విడుదల చేసింది. 2020లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నిలబడాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌పై ఈ నివేదిక ప్రతికూల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్లో డెమొక్రాట్లకు బలం ఉన్నప్పటికీ, 'మ్యూలర్' నివేదిక ఆధారంగా చేసుకొని ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియకు వెళ్లే ఉద్దేశం డెమొక్రాట్లు వ్యక్తం చేయటం లేదు. ప్రస్తుతం ప్రతినిధుల సభ న్యాయ కమిటీ ఈ నివేదికను పూర్తిగా పరిశీలించే పనిలో ఉంది. 'అధికార దుర్విని యోగం'పై దొరికే బలమైన ఆధారాల్ని బట్టి కాంగ్రెస్ న్యాయ కమిటీ ముందుకు వెళ్తుందని వార్తలు వెలువడుతున్నాయి.
'రష్యా జోక్యముంది...కానీ'
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఎసరుతెచ్చిన అంశం 'రష్యా ప్రభుత్వంతో సంబంధాలు'. దీనిపై మ్యూలర్ నివేదిక ట్రంప్‌నకు గొప్ప ఊరట ఇచ్చిందనే చెప్పాలి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందానికి రష్యా ప్రభుత్వం నుంచి కీలకమైన సహ కారం అందిందనీ, రష్యా ప్రభుత్వ జోక్యం ఉందని అనుమానించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయనీ నివేదిక స్పష్టం చేసింది. అయితే మాస్కో వర్గాలకు డొనాల్డ్ ట్రంప్‌నకు మధ్య నేరపూరిత సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పడానికి బలమైన ఆధారాలు లభ్యం కాలేదని 'మ్యూలర్' నివేదిక తేల్చి'ంది.
- డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ చేపట్టడానికి 'మ్యూలర్' నివేదికలో చేసిన ఆరోపణలు సరిపోతాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు బలంగా ఉన్నప్పటకీ, తొలగింపు నిర్ణయం తీసుకునేది 'సెనెట్'.
- 1998లో అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై ప్రతినిధుల సభ చేసిన ఆరోపణల్లో 'న్యాయ విచారణ'ను అడ్డుకోవడం ఒకటి. అయితే ఆనాడు ప్రతినిధుల సభ చేపట్టిన అభిశంసన ప్రక్రియ వీగిపోయింది. క్లింటన్ తొలగింపుపై సెనెట్‌లో మద్దతు రాలేదు.
- అక్కడ రిపబ్లికన్లదే పట్టు కాబట్టి, ట్రంప్ తొలగింపు సాధ్యం కాదని మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.