Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వోలోడీమిర్ జెలెన్స్కీ (41) ప్రమాణం చేయనున్నట్టు ఆదేశ పార్లమెంట్ గురువారం వెల్లడిం చింది. ఈనెల20న ప్రమాణ స్వీకార మహౌత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపింది. ఉక్రెయిన్లో గతనెల21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమేడియన్, డైరెక్టర్ జెలెన్స్కీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఐదేండ్లపాటు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. సమాజంలోని అసమానతనలను రూపుమాపతానని, వైద్య,ఆరోగ్య వ్యవస్థలను తిరిగి గాడిలో పెడతానని, అవినీతిని నిర్మూలిస్తాననే నినాదాలతో ప్రచారం చేపట్టిన జెలెన్స్కీ పట్ల ఓటర్లు ఆకర్షితులయ్యారు. ఆయన్ను దేశాధ్యక్షుడిగా గెలిపించుకున్నారు.