Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురి మృతి, 14 మందిని సురక్షితంగా రక్షించిన సహాయక సిబ్బంది
బీజింగ్ : చైనాలోని షాంఘై నగరంలో ఫైనాన్షియల్ హబ్ ప్రాంతంలోని ఓ భవనం కుప్పకూలింది. ఈఘటనలో ఐదుగురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో 14 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరికొందరు భవన శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. భవనం కుప్పకూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈఏడాది మార్చిలో చైనాలోని ఓ రసాయనిక కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందారు.