Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
- న్యూయార్క్ మేయర్ బిల్‌డె బ్లాసియో
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని గద్దె దింపడమే తన లక్ష్యమని డెమోక్రటిక్ పార్టీ నేత, న్యూయార్క్ మేయర్ బిల్‌డె బ్లాసియో తెలిపారు. వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ' నా స్వస్థలం న్యూయార్క్. నా రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలైంది. ట్రంప్‌తో తలపడే సత్తా నాలో ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. మీ అందరి సహకారం ఉంటే కచ్చితంగా ట్రంప్‌పై గెలుస్తాను. నా తొలి ప్రచారం లోవా, దక్షిణ కరోలినా నగరాల నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను' అని బిల్‌డె బ్లాసియో అన్నారు. 58ఏండ్ల బిల్‌డె బ్లాసియా అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ కీలక నేతగా ప్రజాధరణ చూరగొన్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఎన్నికయ్యేంత వరకు న్యూయార్క్ నగరంలో రిపబ్లికన్ పార్టీకే అత్యంత ప్రజాధరణ ఉండేది. 20 ఏండ్ల తర్వాత మేయర్ పదవికి ఓ డెమోక్రటిక్ పార్టీ నేత ఎన్నికయ్యారు. 2017లో మరోసారి న్యూయార్క్ మేయర్‌గా బిల్డే బ్లాసియో ఎన్నికయ్యారు. కాగా, ట్రంప్ అనుసరిస్తున్న విధానాల పట్ల అమెరికన్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వలసదారుల పట్ల ట్రంప్ వైఖరి, శరణార్థులను సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు తనిఖీలు చేపట్టి అకారణంగా వెనక్కి పంపడం, శరణార్థుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం, వీసాల జారీలో కఠినతరమైన నిబంధనలు, పలు దేశాలకు చెందిన ముస్లిం వలసదారులను అమెరికాలో నిషేధం, భద్రతా వైఫల్యం తదితర అంశాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన బిల్‌డె బ్లాసియో అనేక మీడియా సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడిని విమర్శించారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, శరణార్థుల పట్ల ట్రంప్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలపై గళమెత్తారు.వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను ప్రజలు చిత్తుగా ఓడించాలని అనేకసార్లు పిలుపునిచ్చారు. తాజాగా, డెమోక్రటిక్ పార్టీ తరుఫున అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నట్టు ప్రకటించారు.