Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా ఖండంలో ఆమోదం తెలిపిన తొలిదేశం
తైపి: తైవాన్‌లో ఆదేశ ప్రభుత్వం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. స్వలింగ వివాహం చేసుకోవచ్చంటూ ఆదేశ పార్లమెంటు చట్టం చేసింది. పార్లమెంటులో ఈ బిల్లు పాస్ కాగానే ఆ దేశ ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఇప్పటికే గే వివాహాలపై ఆదేశంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.
బిల్లుకు అనుకూలంగా మొత్తం 66 ఓట్లు రాగా వ్యతిరేకంగా 27 ఓట్లు వచ్చాయి. ఈ కీలక బిల్లు పాస్ కావడంతో ఆ దేశ అధ్యక్షురాలు త్సారు ఇంగ్ వెన్కు రెండోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు మార్గం సుగుమం అయ్యింది. ప్రస్తుతం పార్లమెంటులో పాస్ అయిన బిల్లు అధ్యక్షురాలు త్సారు ఇంగ్ వెన్ సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఇక బిల్లు పాస్ చేసి కొత్త చరిత్ర సృష్టిస్తామని ప్రగతిశీల విలువలు ముందుగా తూర్పు ఆసియా దేశాల నుంచే మొదలవుతాయని మరోసారి నిరూపిస్తామని అధ్యక్షురాలు త్సారు ఓటింగ్ కంటే ముందు ట్విటర్లో పేర్కొన్నారు. ఎక్కడైనా సరే ప్రేమే గెలుస్తుందని ప్రపంచానికి చాటుతామని చెప్పారు. 2016 తన ఎన్నికల ప్రచారంలో వివాహ సమానత్వం చట్టం తీసుకొస్తామని నాటి అధ్యక్ష అభ్యర్థిగా హామీ ఇచ్చారు త్సారు.
ఇదిలా ఉండగా, స్వలింగ వివాహాల తర్వాత పిల్లలను దత్తత తీసుకోవడం, ఇతర దేశాల వారిని వివాహం చేసుకోవడం లాంటి కీలక అంశాలను పొందుపర్చారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 2017 నుంచే స్వలింగ వివాహం బిల్లుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈనెల24లోగా చట్టం చేయాలంటూ ఆదేశ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక గతేడాది స్వలింగ వివాహాలను తైవాన్‌లోని ఓటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు.