Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్: ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన వ్లాదిమిర్ జెలెన్స్కీ పార్లమెంట్‌ను రద్దు చేసి ఆకస్మిక ఎన్ని కలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే అధ్యక్షుడు ఈ ప్రకటన చేయటంతో హాజరైన ఆహూతు లందరూ నివ్వె రపోయారు. ప్రస్తుత పార్లమెంట్ మొత్తం ఇప్పటికీ మాజీ అధ్యక్షుడి సహచరులతో నిండి ఉండటంతో, తమ పార్టీకి స్థానం కల్పించే లక్ష్యంతో ఆయన ఈ ప్రకటన చేసినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నానని, అయితే రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇవ్వటంతో పాటు యుద్ధ ఖైదీలను విడుదల చేసిన తరువాతే చర్చలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.