Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ దేశాలను కోరిన లెబనాన్ ఆరోగ్య మంత్రి
జెనీవా : ఆశ్రయం కోసం లెబనాన్‌కు వచ్చిన శరణార్థులను ఆదుకోవాలని ఆదేశ ఆరోగ్య మంత్రి జమీల్ జబక్ ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. శుక్రవారం జెనీవా నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన 72వ సదస్సులో ఆయన మాట్లాడారు. సహృద్భావంతో శరణార్థులకు తాము ఆశ్రయం కల్పిస్తున్నామని అన్నారు. వీరికి స్థిరనివాసాలు ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ బృహత్కార్యక్రమానికి నిధులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల సహకారం కోరుతున్నామని జమీల్ తెలిపారు. దాతల సహకారం కోసం ఈయూ ఆరోగ్య మంత్రిని అభ్యర్థించామని అన్నారు. కాగా, 2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఫిరంగులు, రాకెట్ లాంఛర్లు, తుపాకుల మోతతో ఈ ప్రాంతమంతా దద్దరిల్లుతున్నది. వేలాది మంది మృతిచెందగా, లక్షలాది మంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. లెబనాన్ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం...10లక్షల మంది సిరియన్లు లెబనాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు.