Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు అల్షాబాబ్ మిలిటెంట్ల హతం
మొగధీషు : సోమాలియాలోని ఉగ్రశిబిరాల లక్ష్యంగా అమెరికా వాయుసేన దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు అల్షాబాబ్ మిలిటెంట్లు హతమైనట్టు అమెరికా ప్రకటించింది. మరికొందరు గాయపడ్డారని తెలిపింది. యూఎస్ ఆఫ్రికా కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం...షాబెల్లే ప్రావిన్స్‌లోని బాలెద్ అమీమ్ నగర శివారు ప్రాంతంలోని అల్షాబాబ్ మిలిటెంట్ల శిక్షణా కేంద్రంపై అమెరికా వాయుసేన దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. సోమాలియాలో కొన్నేండ్లుగా అల్షాబాబ్ మిలిటెంట్లు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. భద్రతా బలగాలను, జన సమ్మర్ధమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు మెరుపుదాడులకు పాల్పడుతున్నారు. ఈదాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అల్షాబాబ్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని సోమాలియా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అమెరికా వాయుసేన 2017 నుంచి ఈ ఆపరేషన్‌కు సహకరిస్తోంది.