Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా యువకుడికి 10ఏండ్ల జైలు
సిడ్నీ : బ్రిటన్కు చెందిన ఓ యువతిని కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డ కేసుల్లో ఓ ఆస్ట్రేలియా యువకుడిని సిడ్నీ న్యాయస్థానం దోషిగా తేల్చి 10ఏండ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...మార్కస్ మార్టిన్ (24) అనే యువకుడు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన ఓ 22 ఏండ్ల బ్రిటన్ యువతిని కిడ్నాప్ చేశాడు. యువతిని ఓ కారులో నిర్బంధించి దాదాపు 1600 కిలోమీటర్లు తిప్పాడు. ఆమెపై దాడికి పాల్పడి చిత్రహింసలు పెట్టాడు. అనంతరం ఓ గదిలో నిర్బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. మార్టిన్ కదలికలపై అనుమానం వచ్చిన గస్తీపోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అతని ఆకృత్యాలు బయటపడ్డాయి.