Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాకస్ : ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న వెనిజులాకు చైనా సహకరిస్తోంది. ఆహారం, మందులు సరఫరా చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నది. చైనా అందిస్తున్న ఆపన్నహస్తం, సహకారానికి వెనిజులా ఆరోగ్య మంత్రి కార్లస్ అల్వరాడో కృతజ్ఞతలు తెలిపారు. చైనా నుంచి తమకు నాలుగు విడతల్లో సహకారం అందిందన్నారు. మంగళవారం చైనా నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో 68 టన్నుల ఆహార పదార్థాలు, మందులు అందినట్టు తెలిపారు. విదేశీ ఆంక్షల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనిజులాను ఆదుకుంటామని వెనిజులాలో చైనా రాయబారి లీ బవోరాంగ్ తెలిపారు.