Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు సృష్టించిన కాలిఫోర్నియా చిన్నారి
వాషింగ్టన్ : జన్మించిన శిశువుల బరువు సాధారణంగా 2-3కేజీలు ఉంటుంది. కొంద రైతే ఇంతకంటే ఎక్కువ బరువే ఉండవచ్చు. పిల్లల బరువు తల్లి తీసుకున్న ఆహారాన్ని బట్టి, అనువంశికతను బట్టి ఉంటుంది. అయితే, కాలి ఫోర్నియాలో పుట్టిన ఓ పాప బరువు మాత్రం 245 గ్రాములు. అంటే పావు కేజీ కంటే తక్కువే. ఓ చిన్న యాపిల్ పండంత బరువే ఉన్న ఈ చిన్నారి తల్లి గర్భాశయంలో కేవలం 23వారాల మూడు రోజులు మాత్రమే ఉంది. అంటే ఆరు నెలలు కూడా నిండక ముందే జన్మించడం వల్ల ఇంత బరువుతో పుట్టింది. అసలు బతకడమే కష్టమనుకున్న ఈ పాపను షార్ప్ మేరీ బిర్చ్ ఆసుపత్రిలోని వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బతికించారు.
డిసెంబరు చివరి వారంలో పుట్టిన ఈ పాపకు అక్కడున్న నర్సులు సేబీ అనే పేరు కూడా పెట్టారు. సేబీ తల్లికి గర్భాశయ సమస్యలు రావడంతో ఆరునెలలు పూర్తవ్వక ముందే ఎమర్జెన్సీ సిజేరియన్ ద్వారా బయకు తీశారు. సుమారు ఐదు నెలల మూడు వారాల పాటు శ్రమించి పాప బరువును 2.2 కేజీలకు తీసుకు వచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి సేబీని ఇంటికి పంపారు.
సేబీ ప్రపంచంలో అత్యంత తక్కువ బరువుతో పుట్టిన పాపగా సేబీ రికార్డు సృష్టించింది. 2015లో జపాన్‌కు చెందిన పాప 252 గ్రాముల బరువుతో పుట్టింది.ఈ చిన్నారి తల్లి గర్భాశయంలో 28 వారాల పాటు పెరిగింది. అప్పటి వరకు ఈ పాప మీద ఉన్న రికార్డు ఇప్పుడు సేబీ అధిగమించింది.