Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీలా: రీసైక్లింగ్ వ్యర్థాల పేరుతో కెనాడా పంపిన చెత్తను ఫిలిప్పీన్స్ వాపస్ పంపించింది. అయితే కెనడా 2013-14 నుంచి రీసైక్లింగ్ వ్యర్థాల పేరుతో గృహ వ్యర్థాలను ఫిలిప్పీన్స్కు తరలిస్తుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా ఫిలిప్పీన్స్ అధి కారులు గుర్తించారు. ఈ క్రమంలో ఫిలి ప్పీన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో తమ దేశానికి పంపిస్తున్న చెత్తను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. దీంతో వ్యర్థాలను వెనక్కి తీసుకోవడానికి కెనడా అంగీకరించింది. ఈ సందర్భంగా ఈ చెత్తను ఒక నౌక ద్వారా కెనడాకు తిరిగి పంపింది. దాదాపు 1500 టన్నుల చెత్తను 69 కంటైనర్లలో నింపి వాంకారో ఓడ రేవులోని ఒక నౌకలోకి ఎక్కించారు. శుక్రవారం ఆ నౌక కెనడాకు పయనమైంది. దాదాపు 20 రోజుల తర్వాత అది కెనడాకు చేరుకొంటుంది.