Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: రిపబ్లికన్ పన్నుల చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వైట్‌హౌస్ ఆర్థిక వేత్త కెవిన్ హాసెట్ త్వరలోనే ప్రభుత్వం నుంచి వైదొలగుతారని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కెవిన్ తనకు, తమ ప్రభుత్వానికి అపారమైన సేవలు అందించారని, అత్యంత ప్రతిభాశాలి అయిన ఆయన అందించిన సేవలకు తాను కృతజ్ఞుడినని, కెవిన్ తనకు నిజమైన మిత్రుడని ట్రంప్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. 57 ఏండ్ల కెవిన్ 2017 సెప్టెంబర్ నుంచి కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్స్‌కు చైర్మెన్‌గా వ్యవహరించారు. మెక్సికో, చైనాలతో అమెరికా వాణిజ్యపోరు కొనసాగిస్తున్న సమయంలో కెవిన్ ట్రంప్ సర్కారు నుంచి నిష్క్రమిస్తుండటం గమనార్హం. అయితే వాణిజ్య పోరుకు, తన రాజీనామాకు ఎటువంటి సంబందమూ లేదని కెవిన్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రెండూ భిన్నమైన అంశాలని ఆయన వివరించారు.