Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యాలో సీ జిన్‌పింగ్ పర్యటన
బీజింగ్/మాస్కో: రష్యాతో కొనసాగుతున్న స్నేహ సంబం ధాలలో కొత్త శకానికి నాంది పలికే లక్ష్యంతో చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ బుధవారం రష్యా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం మా స్కోకు చేరుకున్న సీ బృందానికి పూర్తి అధికార లాంఛనాలతో స్వాగతం లభించింది. విమానా శ్రయం నుండి అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌కు తరలి వెళ్లిన సీ జిన్‌పింగ్ పుతిన్‌తో ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం రష్యా ప్రభుత్వం తన గౌరవార్థం ఏర్పాటు చేసిన రిసెప్షన్లో ఆయన పాల్గొన్నారు. రాత్రి బోల్షారు థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యారు. రష్యా 2014లో క్రిమియాను తమ దేశంలో విలీనం చేసుకున్న తరువాత పశ్చిమ దేశాలతో విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో చైనా అధ్యక్షుడి పర్యటన కొనసాగుతుండటం విశేషం. సీ బృందం గురువారం నాడు మాస్కో నుండి రష్యాలోని పాత రాజధానీ నగరం సెంట్ పీటర్స్బర్గ్కు వెళ్లి అక్కడ పుతిన్ ఆధ్వర్యంలో గురు-శుక్రవారాల్లో జరిగే ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. రష్యా పర్యటనకు బయల్దేరే ముందు ఆయన తనను కలిసిన రష్యన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చైనా-రష్యా మధ్య పటిష్టమైన రాజకీయ సంబంధాలతో పాటు పరస్పర విశ్వాసం, ఎదుటి వారి సమస్యలకు మద్దతు కొనసాగించటం వంటి అంశాలకు కట్టుబడి ఉంటాయని స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడి పర్యటన ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలలో కీలకమైన ఘట్టమని పుతిన్ విదేశాంగ విధాన సలహాదారు యూరి యుషకోవ్ వ్యాఖ్యానించారు. 1949 కమ్యూనిస్టు చైనాను అధికారికంగా గుర్తించిన తొలి దేశం నాటి సోవియట్ యూనియనేనని ఆయన గుర్తు చేశారు.
'ప్రపంచ భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారంతో కొత్త శకంలో ప్రవేశించే అంశంపై సీ జిన్‌పింగ్ పుతిన్ ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేస్తారని ఆయన వివరించారు. చైనా బృందం రెండు పాండాలను మాస్కో జూకు కానుకగా బహూకరించింది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిలో సీ పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చైనా ఉప విదేశాంగ మంత్రి ఝాంగ్ హానురు చెప్పారు.