Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ అరెస్ట్ అయ్యారు. నకిలీ బ్యాంకు అకౌంట్ల ద్వారా భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డ ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జర్దారీతో పాటు ఆయన సోదరి ఫర్యాల్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న జర్దారీ నిర్వహిస్తున్న లావాదేవీలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పలు నకిలీ అకౌంట్ల ద్వారా సోదరితో కలిసి సుమారు 150 మిలియన్ డాలర్ల ( రూ.1,042 కోట్లు )నగదు బదిలీ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలో జర్దారీతో పాటు ఆయన సోదరిని అదుపులోకి తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖ నిర్ణయించింది. దీంతో, ఆయనను సోమవారం అరెస్టు చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ముందస్తు బెయిల్ తెచ్చుకున్న జర్దారీ దీన్ని పొడిగించాలని కోరుతూ ఇస్లామబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసారి అత్యున్నత న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయన సోదరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.