Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి 2020లో జరిగే ఎన్నికల్లో తన ప్రత్యర్ధికి సంబంధించి విదేశాల నుండి అందే సమాచారాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒక మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ట్రంప్ ఈ విషయమై ప్రస్తావించారు. అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్ధి విదేశీ సహాయాన్ని పొందడంలో తప్పేమీ లేదన్నారు. అంటే అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని అంగీకరిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అదేమీ కాదని, విదేశం నుండి కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని ట్రంప్ చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయముందని వచ్చిన ఆరోపణ లపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం గత రెండేళ్ళుగా ట్రంప్ ప్రభుత్వాన్ని వెంటా డుతోంది. అయినా అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థికి సంబంధించిన సమా చారాన్ని విదేశం నుండి పొందడంలో తప్పేమీ లేదంటూ ట్రంప్ తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. రష్యా, చైనాలు ప్రత్యర్ధిపై సమాచారం ఇచ్చేందుకు సిద్ధపడితే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధాన మిస్తూ సహాయం తీసుకోవడం వరకు తప్పేమీ లేదని, అంత మాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని అన్నారు. తాను కూడా సమాచారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై డెమొక్రటిక్ అభ్యర్ధి జో బిడెన్ వ్యాఖ్యానిస్తూ అమెరికా ఓటింగ్లో విదేశీ జోక్యాన్ని ట్రంప్ స్వాగతిస్తున్నారన్నారు. విదేశీ జోక్యం ఒక్క రాజకీయాలకే పరిమితం కాదని, దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలనుకునేవారి సహాయ ప్రోత్సాహాలను అమెరికా అధ్యక్షుడు కోరకూడదని ఆయన ట్వీట్ చేశారు.