Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: నేరారోపణలపై విచారణ కోసం హాంగ్‌కాంగ్ పౌరులను చైనాకు అప్పగించే బిల్లుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ హాంగ్‌కాంగ్‌లో వారం రోజుల నుంచి నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లును కొంతమంది పౌరులు సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ బిల్లు చట్టంగా మారినట్టయితే హాంగ్‌కాంగ్‌లో పెరిగిపోయిన నేరాలను నిర్మూలించేందుకు వీలుంటుందని బిల్లు మద్దతుదారులు చెబుతుండగా, వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతామంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో బిల్లు ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదావేసినట్టు హాంగ్‌కాంగ్ వెల్లడించింది. ప్రభుత్వ ముఖ్య కార్యనిర్వాహక అధికారి క్యారీ లామ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.