Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డుషన్బ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శనివారం తన 66వ పుట్టిన రోజు వేడుకను జరుప కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రుడుగా చెప్పుకునే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐస్ క్రీమ్‌లను బహుమతిగా ఇచ్చినట్టు చైనీస్ మీడియా పేర్కొంది. సీనియర్ నాయకుల వ్యక్తిగత జీవితాల్ని బహిరంగ పరచడం చైనాలో అరుదుగా జరుగుతుంటుంది. అందుకే చాలా మంది పుట్టినరోజులు బయటి ప్రపం చానికి తెలియవు. దానిని రహస్యంగానే ఉంచేందుకు అక్కడ ప్రయ త్నిస్తుం ఓటారు. తజికిస్థాన్ రాజధాని డుషన్బ్లోని ఓ హోటల్లో పుట్టిన రోజు సందర్భంగా జిన్‌పింగ్, పుతిన్ షాంపైన్ గ్లాసు చేతిలో పట్టుకుని కనిపించిన చిత్రాల్ని ఓ చైనా టీవీ ఛానల్ ప్రసారం చేసింది. జిన్‌పింగ్‌కు కానుకగా పుతిన్ ఐస్క్రీంలున్న బాక్స్ ఇచ్చారు. దానికి ప్రతిగా జిన్‌పింగ్ ఓ చైనీస్ తేనీరును పుతిన్‌కు అందజేశారు. పుతిన్‌కు జిన్‌పింగ్ ధన్యవాదాలు తెలియజేశారని, చైనాలో పుతిన్‌కు అధిక పాపులారిటీ ఉందని సదరు మీడియా పేర్కొంది. మరో చైనీస్ వెబ్సైట్లో ఎరుపు, నీలం మిఠాయి పూల డిజైన్లతో అలంకరించిన కేక్ వద్ద జిన్‌పింగ్, పుతిన్‌లు నిల్చున్న ఫొటోను షేర్ చేసింది. చైనా భాషలో 'గుడ్ ఫార్చూన్ డబుల్ సిక్స్' అనే అక్షరాలు దానిపై రాసి ఉన్నట్టుగా తెలిసింది.