Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.4గా నమోదు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఈశాన్య దిశలోని కెర్మాడెక్ ద్వీప సమీపంలో 7.4 తీవ్రతతో భూమి కంపించిందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. దీంతో భూకంప కేంద్రం నుంచి దాదాపు 300 కి.మీ వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని 'పసిఫిక్ సునామీ సెంటర్' తొలుత హెచ్చరికలు జారీ చేసింది. కానీ ప్రకంపనల తీవ్రత పెద్దగా లేదని గుర్తించిన అనంతరం సునామీ హెచ్చరికల్ని రద్దు చేసింది. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కెర్మాడెడ్ ద్వీపంలో భూమికి 10 కి.మీ లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. పసిఫిక్ తీరంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్‌లో తరచూ భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.