Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరాన్ని అంగీకరించిన ఇజ్రాయిల్ ప్రధాని భార్య
జ్రెరూసలేం: ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడినట్టు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ భార్య సారా నెతన్యాహూ అంగీకరించారు. మోసం, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిన కేసుల్లో తనకు శిక్ష తగ్గించాలంటూ న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఆమె అభ్యర్థనను జస్టిస్ అవిటాల్ చెతన్ రికార్డు చేశారు. జరిమానా చెల్లించేందుకు సారా సిద్ధంగా ఉన్నారని ఆమె తరుఫు న్యాయవాది చేసిన అభ్యర్థనతో ప్రాసిక్యూటర్ ఎరెజ్ పదాన్ కూడా ఏకీభవించారు. ఇలాంటి నేరాలు సారా పునరావృతం చేయకూడదని కోరారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో జరిమానా చెల్లించేందుకు సారా అంగీకరించడంతో ఈకేసుపై విచారణ ముగిసింది.