Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుపై చైనా
బీజింగ్: దాదాపు 18 అరబ్ దేశాల సహకారంతో నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ఆయా దేశాల మెరుగైన భవితకు మార్గం సుగమం చేస్తుందని చైనా వాణిజ్య శాఖ ఉప మంత్రి కియాన్ కెమింగ్ చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సహకరించేందుకు అవసరమైన ఒప్పందాలపై 18 అరబ్బు దేశాలు సంతకాలు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అరబ్ దేశాలు, వారి పెట్టుబడిదారులతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు చైనా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా పోర్టులు, రైల్వేలు, విద్యుత్, టెలికమ్యూనికేషన్ రంగాలలో ఈ సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన వివరించారు. 2013లో ఈ ప్రాజెక్టును ఆవిష్కరించిన అధ్యక్షుడు జిన్పింగ్ ఈ ప్రాజెక్టు చైనాను ఆసియా, ఐరోపా దేశాలతో మమేకం చేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా చైనాను ఆగేయాసియా దేశాలు, గల్ఫ్ దేశాలు, తూర్పు, ఉత్తర ఆఫ్రికా, ఐరోపా దేశాలను సముద్ర మార్గాల ద్వారా అనుసంధానించాలని చైనా ప్రతిపాదించింది.