Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్ : యూరోపియన్ యూనియన్ (ఈయూ) కమిషన్ ప్రెసిడెంట్ ఆశావహ అభ్యర్థుల జాబితాలో తానూ ఉన్నట్టు జర్మనీ రక్షణ శాఖ మాజీ మంత్రి వాన్‌డెర్ లెయెన్ ప్రకటించుకున్నారు. తాను ఈయూ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైనట్టయితే పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడతానని అన్నారు. ఈయూ పార్లమెంట్ సభ్యులు తన నామినేషన్‌కు మద్దతు పలకాలని ఆకాంక్షించారు. ఈయూ పార్లమెంట్లో జరగనున్న ఓటింగ్‌లో తనకు ప్రాధాన్యం కల్పించాలని ఎంపీలను కోరారు. అంతకుముందు, సెంటర్ రైట్ యూరోపియన్ పీపుల్స్ పార్టీ, సెంటర్ లెఫ్ట్ సోషలిస్ట్స్ అండ్ డెమోక్రట్స్, లిబరల్ రెన్యూ యూరప్ బ్లాక్స్లకు తాను లేఖలు పంపినట్టు చెప్పారు. ఈయూ పార్లమెంట్‌లోని మెజారిటీ సభ్యులు తనకు మద్దతిస్తారని ఆకాంక్షించారు.