Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: బ్రిటన్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థినులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. గత నాలుగేండ్లలో పదింతలు పెరగడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2014లో 65 లైంగిక దాడుల ఘటనలు చోటుచేసుకోగా..గతేడాది 626కు చేరుకున్నాయి. బర్మింగ్హామ్ కేంబ్రిడ్జి యూనివర్శిటీ, ఈస్ట్ ఆంగ్లియా వర్సిటీ అందించిన ప్రకారం ఆ ఏడాది దాదాపు 2000 లైంగిక దాడులు, వేధింపు సంఘటనలు చోటు చేసుకున్నాయని 'ఛానల్ 4 న్యూస్' దర్యాప్తులో తేలింది.
వీటిలో ఎక్కువ సంఘటనలు కేసుల వరకు వెళ్లలేదు. కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారనే ఆందోళనతో చాలా సంఘటనలపై బాధితులైన విద్యార్థినులు ఫిర్యాదు చేయలేదు. కొందరు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా ముందుకు వెళితే వారిని యూనివర్శిటీల నుంచే అధికారులు తొలగించి వేశారట. గత కొంతకాలంలో లైంగిక దాడులు మరీ పెరిగిన నేపథ్యంలో యూనివర్శిటీ అధికారులు 'సెక్స్వెల్ అసాల్ట్ అడ్వైజరీ సెల్స్'ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ విభాగాలు మహిళలు తమకు జరిగిన అన్యాయాలను సక్రమంగా ఫిర్యాదు చేయడానికి తోడ్పడుతున్నాయి. 60 శాతం మంది మహిళలు కళాశాలల నుంచి నేడు సురక్షితంగా ఇంటికి వెళ్లలేమని ఓ అధ్యయనంలో వెల్లడించారు. తమకు ఉద్దేశపూర్వకంగానే అనవసరంగా తాకుతున్నారని 35 శాతం మహిళలు వాపోతున్నారు.