Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోరిస్ జాన్సన్కు చర్చల ఆహ్వానం
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి వచ్చే వారం జరుగనున్న ఎన్నికల్లో మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఒప్పందమూ లేని నిష్క్రమణ (నోడీల్ బ్రెగ్జిట్)ను నివారించటానికి అవసరమైన కొత్త ప్రణాళికలతో తమ వద్దకు రావాలని ఐరోపా కూటమి సభ్యదేశాలు జాన్సన్కు రహస్యంగా సూచించినట్టు మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. కొంతమంది సీనియర్ ఐరిష్ రాజకీయ వేత్తలు, దౌత్యవేత్తలు జాన్సన్ ప్రతిపాదిత కేబినెట్ సభ్యులిద్దరితో ఈ అంశంపై మంతనాలు జరిపినట్టు సన్డే టైమ్స్ పత్రిక తన కథనంలో వివరించింది. బ్రెగ్జిట్ విషయంలో ఒక ఒప్పందం కుదుర్చుకునే అంశంపై జాన్సన్ను తాము కూడా సంప్రదించినట్టు జర్మన్, ఫ్రెంచ్, డచ్, బెల్జియం నేతలు కూడా వెల్లడించినట్టు ఈ పత్రిక తన కథనంలో పేర్కొంది. బ్రెగ్జిట్ విషయంలో ఒక రాజీ ఒప్పందాన్ని సిద్ధం చేసినట్లు ఐరిష్ విదేశాంగ మంత్రి సైమన్ కావేనీని ఉటంకిస్తూ ఈ పత్రిక తన వార్తా కథనాలలో వెల్లడించింది.
లండన్లో జాన్సన్ వ్యతిరేక ప్రదర్శనలు :
ప్రధాని పదవికి పోటీపడుతున్న మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్కు వ్యతిరేకంగా శనివారం లండన్ నగరంలో భారీ ప్రదర్శన జరిగింది. ఐరోపాలోని వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోషనల్ హెల్త్ సర్వీస్ ఫర్ పీపుల్స్, తదితర స్వచ్ఛంద సంస్థలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 'మార్చ్ ఫర్ ఛేంజ్' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో వారంతా బ్రిటన్ ఐరోపా కూటమిలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. నో బోరిస్, యెస్ టు యూరప్ అన్న నినాదాలతో ప్రదర్శన మొత్తం హౌరెత్తింది.