Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాంగ్‌కాంగ్ : హాంగ్‌కాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. నేరారోపణులు ఎదుర్కొంటున్న నిందితులను పారదర్శకమైన విచారణ నిమిత్తం చైనాకు పంపించాలని ప్రతిపాదిస్తూ హాంగ్‌కాంగ్ ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టింది. ఈబిల్లు పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో, హాంగ్‌కాంగ్ చీఫ్ కారీ లామ్ ఈ బిల్లు అంశాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లును పూర్తిగా రద్దు చేయాలని, లామ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. గత రెండు నెలల నుంచి హాంగ్‌కాంగ్‌లో ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. చైనా ప్రభుత్వం లామ్‌కు మద్దతుగా నిలిచింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించొద్దని సూచించింది. దీంతో, హాంగ్‌కాంగ్ పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. హాంగ్‌కాంగ్‌లో అశాంతియుత వాతావరణం సృష్టించేందుకు పలు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని చైనా ప్రతినిధి యాంగ్గాంగ్ తెలిపారు. చట్టాన్ని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించినట్టయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరసనకారులు తమ ఆందోళన కార్యక్రమాలు విరమించాలని కోరారు.