Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్యోగ్యాంగ్: ఉత్తర కొరియా రెండు స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించిందని దక్షిణకొరియా ఆర్మీ ప్రకటించింది. గడిచిన రెండు వారాల్లో ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగించడం ఇది నాలుగోసారి. దక్షిణ హవాంగే ప్రావిన్సు నుంచి ఈ మిస్సైళ్ల పరీక్ష జరిగిందని దక్షిణకొరియా పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియా మధ్య సోమవారం ప్రారంభమైన సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా వ్యతిరేకిస్తున్నది. వాస్తవానికి రెండు దేశాల మధ్య డ్రిల్స్ అధికారికంగా ఈనెల11న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వారం రోజుల ముందుగానే సైనిక విన్యాసాలు ప్రారంభించింది. దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేపడుతున్న నేపథ్యంలో క్షిపణుల పరీక్షలు చేపట్టాల్సి వస్తుందని ఉత్తర కొరియా వెల్లడించింది. ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణులు 37 కిలోమీటర్ల ఎత్తులో 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టు దక్షిణకొరియా అంచనా వేస్తున్నది