Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు
వాషింగ్టన్ : కాలిఫోర్నియాలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. స్థానిక బేకరిలోకి చొరబడి నిర్వాహకుడితో పాటు మరో ముగ్గురిని హత్య చేశాడు. అనంతరం క్యాష్ కౌంటర్లోని నగదు తీసుకొని పరాయ్యాడు. ఈ ఘటనను గమనించి నిందితున్ని వెంబడించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ హత్యలతో సంబంధాలున్న ఆరోపణలపై ఆరంజ్కౌంటీ నగరానికి చెందిన 33ఏండ్ల యువకుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు కాలిఫోర్నియా పోలీస్ అధికారులు తెలిపారు.