Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదు
తైపీ : తైవాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. ఇలాన్ ప్రాంతంలో 22కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అన్నారు. భూప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. కాగా, తైవాన్‌లో 1999లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైంది. ఈ విపత్తులో 2వేల మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. 2016లోనూ తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 100 మందికి పైగా మృతి చెందారు.