Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలువునా చీలిన పాలక కూటమి
సిడ్నీ : ఆస్ట్రేలియన్ పాలక కూటమికి చెందిన ఎంపీ ఒకరు చైనా ఎదుగుదలను నాజీ జర్మనీతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయటంతో పాలక కూటమి నిలువునా చీలిపోయింది. గతంలో ప్రత్యేక దళాలలో సైనికుడిగా పనిచేసిన కన్జర్వేటివ్ ఎంపీ ఆండ్రూ హాస్టీ గత గురువారం ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మట్లాడుతూ చైనా ఎదుగుదలను నాజీ జర్మనీతో పోల్చి వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యాఖ్యలపై అధికార కూటమిలో మిశ్రమ స్పందన వ్యక్తం కాగా, వాటిని చైనా తీవ్రంగా ఖండించింది. హాస్టీకి ఎటువంటి మంత్రిపదవీ లేనప్పటికీ పాలక లిబరల్-నేషనల్ కూటమిలో ప్రభావం కలిగిన నేత, దేశానికి సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారంతో వ్యవహరించే పార్లమెంట్ ఇంటిలిజెన్స్, భద్రతా కమిటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
చైనాపై హాస్టీ చేసిన వ్యాఖ్యలను ఆస్ట్రేలియా అటార్నీ జనరల్ క్రిస్టియన్ పోర్టర్, ఆర్థిక మంత్రి మథియాస్ కార్మన్ తీవ్రంగా తప్పుపట్టారు. అయితే హోం మంత్రి పీటర్ డ్యుటన్ హాస్టీ వ్యాఖ్యలను సమర్ధించగా ప్రధాని స్కాట్ మారిసన్ మాత్రం ఎటూ స్పందించకుండా తటస్థంగా ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి సైమన్ బర్మింగ్హామ్ కూడా హాస్టీ వ్యాఖ్యలతో విభేదించారు. కాగా గతంలో ఇజ్రాయిల్లో ఆస్ట్రేలియా రాయబారిగా పనిచేసిన లిబరల్ పార్టీ సభ్యుడు వెంట్వర్త్ దేవ్ శర్మ హాస్టీ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్వీట్ చేశారు. గతంలో చైనాతో వాణిజ్యంలో ప్రధాన భాగస్వామిగా వున్న ఆస్ట్రేలియా ఆ ప్రభుత్వం తమ దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందంటూ సంబంధాలను తగ్గించుకుంటూ, అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకుంది.