Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిన్‌పింగ్ సర్కారుకు క్షమాపణలు చెప్పిన 'స్వరోవ్స్కీ' సంస్థ
బీజింగ్ : ఆస్ట్రేలియాలో బంగారు ఆభరణాల విక్రయ దిగ్గజ సంస్థ స్వరోవ్స్కీ చైనాకు క్షమాపణలు చెప్పింది. చైనాలో తైవాన్ అంతర్భాగమేననే విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
తైవాన్ స్వతంత్య్ర దేశమని, తైవాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ప్రసాదించాలని తాము చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. జిన్‌పింగ్ సర్కారుకు క్షమాపణలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనీయుల మనోభావాలను దెబ్బతీసి నందుకు క్షమిం చాలని తెలిపింది. కాగా, చైనాకు వ్యతిరేకంగా స్వరో వ్స్కీ సంస్థ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా బంగారు ఆభరణాల విక్రయాలు తగ్గిపోయాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన స్వరోవ్స్కీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించలేనని ప్రముఖ చైనా నటి జియాంగ్ సూయింగ్ తేల్చి చెప్పారు.
స్వరోవ్స్కీ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసుకున్నట్టు పలు సంస్థలు పేర్కొన్నాయి. దీంతో, స్వరోవ్స్కీ ఒక్కసారిగా ఖంగుతిన్నది. తాము చేసిన తప్పును తెలుసుకుంది. జిన్‌పింగ్ సర్కారుకు క్షమాపణలు చెప్పింది.