Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్లో విద్యార్థుల నిరసనలు
రియో డీ జెనీరియో : బ్రెజిల్‌లోని 72 నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి చేరుకొని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. విద్యా రంగాన్ని నీరుగార్చేందుకు సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వర్సిటీల నిర్వహణ కోసం బడ్జెట్లో అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. భారీ ర్యాలీలు తీశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. కాగా, విద్యారంగానికి నిధుల కేటాయింపు విషయంలో బ్రెజిల్ సర్కార్ మొండిచేయి చూపింది. విద్యారంగానికి నిధుల కేటాయింపులో 30 శాతం కోత విధించింది. అంతేగాకుండా, ఈఏడాది నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉపకార వేతనాలను ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పరిశోధనా రంగాలకు ఎలాంటి కేటాయింపులు ఉండవని స్పష్టం చేసింది. దీంతో, విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. వర్సిటీ నిర్వహణ కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.