Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్,చైనాల అభివృద్ధిని అడ్డుకుంటా : ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్, చైనా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా దేశాలకు అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చోటు లేదని ఆరోపించారు. ఈ రెండు దేశాలకు ప్రపంచ వాణిజ్య వాణిజ్య సంస్థ వర్ధమాన దేశాల జాబితాలో చేర్చడం తనకు విస్మయానికి గురిచేసిందని అన్నారు. ఒకవేళ ఈ రెండు దేశాలు అభివృద్ధి చెందుతున్నా దాన్ని తాను అడ్డుకుంటానని ట్రంప్ నోరు పారేసుకున్నారు. 'అమెరికా ఫస్ట్' విధానంలో విజయం సాధించినట్టు భావించుకుంటున్న ట్రంప్, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించినందుకు భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. సుంకాలు విధిం చడంలో భారత్ రారాజు అని ఆరోపించారు. ప్రస్తుతం చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ భారీగా సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతనెలలో అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఏమిటో నిర్వచనం ఇవ్వాల్సిందిగా ప్రపంచ వాణిజ్య సంస్థను ట్రంప్ కోరారు.
చైనా, టర్కీ, భారత్‌లకు ప్రపంచ మార్కెట్లలో పలు నిబంధనలు సడలించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను అదునుగా తీసుకుని ఆయా దేశ ఆర్థిక వ్యవస్థలు లబ్ది పొందుతున్నాయి ట్రంప్ ఆరోపించారు. అలాంటి దేశాలపై చర్యలు తీసుకోవాలని తన పాలనా విభాగానికి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. భారత్, చైనాలు ఇదే తరహా అడ్వాంటేజ్ తీసుకుని తమను తాము అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకుంటున్నాయని ఓ కార్యక్రమంలో ట్రంప్ ఆరోపించారు.