Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్ సర్కార్‌పై చైనా ఆగ్రహం
తైవాన్ : తైవాన్‌కు యుద్ధ విమానాలను విక్రయించనున్నట్టు అమెరికా వెల్లడించింది. అమెరికా నుంచి 8బిలియన్ డాలర్ల విలువైన 16 ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్టు తైవాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తైవాన్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాలో అంతర్భాగమైన తైవాన్‌కు యుద్ధ విమానా లను విక్రయించాలనే అమెరికా చర్యలపై మండిపడింది. ఇరుదేశాల మధ్య కుదిరిన అక్రమ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని హెచ్చరించింది. దీంతో, అమెరికా కొంతకాలం వెనక్కి తగ్గింది. తాజాగా, తైవాన్‌తో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా యుద్ధ విమానాలను విక్రయించాలని నిర్ణయించుకున్నామని ప్రకటించింది. మార్టిన్ సంస్థ తయారు చేసిన అధునాతనమైన ఎఫ్-16 సీ బై డీ బ్లాక్70 యుద్ధ విమానాలను తైవాన్‌కు సరఫరా చేయనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. అమెరికా చేసిన తాజా ప్రకటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు. తైవాన్‌కు ఆయుధాలను, క్షిపణులను, యుద్ధ విమానాలను విక్రయిం చాలనే నిర్ణయాన్ని అమెరికా ఉపసంహరిం చుకోక పోయినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.