Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: 2020 అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూయార్క్ సిటీ మేయర్ డెమొక్రాట్ బిల్ డే బ్లాసియో శనివారం ప్రకటించారు. 'ఇది నా సమయం కాదన్నది స్పష్టమైపోయింది. గనుక అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రచారం నుంచి విరమించుకుంటున్నా'.అని స్థానిక మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో బ్లాసియో తెలిపారు. అమెరికాలో అతి పెద్ద నగరమైన న్యూయా ర్క్కు మేయరుగా తాను ఎప్పటిలానే కొనసాగుతానని ఆయన చెప్పారు. శ్రామిక ప్రజానీకం తరపున తాను ఇక ముందు కూడా గొంతెత్తుతానని ఆయన అన్నారు.
అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయన డెమొక్రటిక్ పార్టీ కష్టజీవుల అవసరాల పై దృష్టి సారించాలని హితవు పలికారు. నీలి రంగు దళం ఈ మార్గంలో వెళ్లకుంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్యే మళ్లీ గెలిచే ప్రమాదముందని బ్లాసియో హెచ్చరించారు.