Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలుపరిచే నిబంధనలకు వ్యతిరేకంగా అమెరికా ఫెడరల్ కోర్టు తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు న్యాయమూర్తి జార్జ్ డేనియల్స్ 14 పేజీల అభిప్రాయాన్ని పేర్కొన్నారు. ఇందులో డొనాల్డ్ ట్రంప్ నిబంధనలతో వలసదారులు ఏవిధంగా ప్రభావితమవుతున్నారనీ, ఆ నిబంధనలు అమల్లోకి వస్తే వారు ఏవిధంగా నష్టపోతారో తెలిపారు. చట్టబద్ద వలసదారులను గుర్తించి, వారికి అన్ని హక్కులను కల్పించాలని ఆయన తెలిపారు. వలసదారుల సంక్షేమాన్ని ఉద్ధేశించి ఆగస్టు 14న డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కొన్ని అంశాలను ప్రతిపాదించినా ..అవి చర్చకు అనుమతించలేదని డేనియల్స్ తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం..చట్టబద్దమైన వలసదారులను శాశ్వత నివాసితులుగా గుర్తించి, వారికి గ్రీన్ కార్డులను అందజేయాలి. ప్రభుత్వం నుంచి ఆహార, వసతి, మెడికల్ వంటి ప్రజా సహాయ కార్యక్రమాలను వర్తింపజేయాలని తీర్మానించారు. అలాగే యూఎస్ వీసాలను కోరుకునే వ్యక్తులను ఆరోగ్యబీమా సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. వలసదారులకు ఆరోగ్య సంరక్షణ పథకాలను నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటన విడుదల చేసిన వారం తరువాత జిల్లా కోర్టు ఈ తీర్పు వెలువరించడం గమనార్హం.