Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19ఏండ్ల పాటు అక్రమ నిర్బంధానికి గురైన ఈస్ట్మన్
సిడ్నీ : అక్రమ నిర్బంధానికి గురైన ఆర్థికవేత్త ఈస్ట్మన్కు 4.75 మిలియన్ డాలర్ల ( రూ.33 కోట్ల ) పరిహారం చెల్లించాలని ఆస్ట్రేలియా సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1989లో క్యాన్బెర్రా నగరంలో కాలిన్ వించెస్టర్ అనే ఐపీఎస్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో అరెస్టయిన ఈస్ట్మన్పై పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. వించెస్టర్ని ఈస్ట్మన్ హత్య చేసినట్టు ధ్రువీకరించే సాక్ష్యాధారాలు లభించకపోయినప్పటికీ దిగువ న్యాయస్థానం 1995లో ఈస్ట్మన్కు జీవితఖైదు విధించింది. ఈస్ట్మన్ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై ఆస్ట్రియన్ క్యాపిటల్ టెర్రిటరీ సుప్రీంకోర్టు విచారించి పై ఆదేశాలు జారీ చేసింది.