Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇద్దరు మహిళా వ్యోమగాములు చరిత్ర సృష్టించనున్నారు. పురుషుల సాయం లేకుండా క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్లు శుక్రవారం స్పేస్‌వాక్ చేయనున్నారు. ఈ సాహసం చేసిన పూర్తి స్థాయి తొలి మహిళా బృందంగా వీరు చరిత్ర సృష్టించనున్నట్టు నాసా ట్వీట్ చేసింది. స్పేస్ వాక్ చేయనున్న తొలి పూర్తిస్థాయి మహిళా బృందం ఇదే కావడం విశేషం. నాసా అంతరిక్ష కేంద్రంలో ఇప్పటి వరకు 420మంది వ్యోమగాములు స్పేస్ వాక్ చేశారు. ఈ స్పేస్ వాక్‌లో ప్రతిసారీ పురుషుల సంఖ్య అధికంగా ఉంటున్నది. అయితే ఈ సారి మాత్రం పురుష వ్యోమగాములు లేకుండా ఇద్దరు మహిళా వ్యోమ గాములే స్పేస్ వాక్ చేయనున్నారు. వీరిద్దరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తలెత్తిన లోపాల్ని సవరించున్నారు. పాడైన బ్యాటరీ కంట్రోలర్ల స్థానంలో కొత్తవాటిని అమర్చడానికి స్పేస్ వాక్ చేయనున్న క్రిస్టినా కోచ్, జెస్సికా మెయిర్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు అని నాసా ప్రకటించింది. ఇదిలా ఉండగా, 1965లో రష్యా వ్యోమగామి మొదటిసారిగా స్పేస్ వాక్ చేయగా 1984 లో మొదటి మహిళా స్పేస్ వాక్ చేసింది. ఇప్పటి వరకు 15 మంది మహిళలు స్పేస్ వాక్ చేయడం విశేషం. మార్చిలోనే పూర్తి స్థాయి మహిళా బృందాన్ని స్పేస్ వాక్‌కి పంపాలని నాసా నిర్ణయించినప్పటికీ.. సాంకేతిక కారణాలతో దాన్ని నిలిపివేసింది.