Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా : కెనడాలో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ సోమవారం ప్రారంభమెంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని, లిబరల్ పార్టీ నేత జస్టిన్ ట్రూడో, కన్జర్వేటివ్ పార్టీ నేత ఆండ్రీవ్ స్కీర్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో జస్టిన్ ట్రూడోకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. మరోసారి ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని అన్నారు. తృతీయ స్థానంలో న్యూడెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ నిలిచే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కెనడాలో గతంలో లిబరల్స్ లేదా కన్జర్వేటివ్ పార్టీ నేతలే అధికార పగ్గాలు చేపట్టారు. గతనెల రోజుల నుంచి న్యూ డెమోక్రటిక్ పార్టీ నేతలు, బ్లాక్ క్యూబెకాయిస్ పార్టీలు విస్తృత ప్రచారం చేపట్టాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీ అభ్యర్థుల ఓట్లు చీల్చే అవకాశముందనే వార్తలు వెలువడ్డాయి. కెనడాలో 338 పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 170పార్లమెంట్ స్థానాల మెజారిటీ సాధించిన నేతను ప్రధానిగా ప్రకటిస్తారు. కెనడాలో ఐదు ప్రధాన ఫెడరల్ పార్టీలున్నాయి. గ్రీన్పార్టీకి ఎలిజబెత్ మే, లిబరల్ పార్టీకి జస్టిన్ ట్రూడో, కన్జర్వేటివ్ పార్టీకి ఆండ్రీవ్ స్వీకర్, పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా నేత మాక్సిమ్ బెర్నియర్, బ్లాక్ క్యూబెకోల్స్ నేత వైవెస్ ఫ్రాంకోయిస్ వైఎస్, ఎన్డీపీ నేత జగ్మీత్ సింగ్ తదితరులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. 2015లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్స్ పార్టీకి 184 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. దీంతో, లిబరల్స్ పార్టీ నేత జస్టిన్ ట్రూడో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2006 నుంచి కన్జర్వేటివ్ పార్టీ ప్రతిపక్ష హౌదాలో కొనసాగుతోంది. అప్పట్లో కన్జర్వేటివ్ పార్టీకి 99 పార్లమెంట్ స్థానాలు దక్కాయి.