Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొలీవియాను కోరిన క్యూబా అధ్యక్షుడు కానెల్
హవానా : బొలీవియాలో పనిచేస్తున్న నల్గురు క్యూబన్ హెల్త్ వర్కర్స్‌ను వెంటనే విడిచిపెట్టాలని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్ కానెల్ కోరారు. బొలీవియాలో నిరసనలకు నిధులను సమకూరుస్తున్నారని ఆరోపిస్తూ బొలీవియాలోని అనీజ్ ప్రభుత్వం వీరిని బంధించి హింసిస్తున్నట్లు వార్తలు రావడంతో క్యూబా అధ్యక్షుడు దీనిపై స్పందించారు. వారిపై చేసిన ఆరోపణలు నిరాధార మైనవని క్యూబా నేత ఖండించారు. బొలీవియా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న హెల్త్ వర్కర్లపై విద్వేషం వెళ్లగక్కటం శోచనీయ మని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.