Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రిటోరియా : దక్షిణాఫ్రికా ఇస్లాం మత గురువు షేక్ అహ్మద్ దీదత్ కుమారుడు యూసుఫ్ దీదత్పై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. తలలో బుల్లెట్ దూసుకెళ్లిన యూసుఫ్ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. జిల్లా ఎస్పీ తెంబెక ఎంబెలె తెలిపిన వివరాల ప్రకారం...దర్బన్ కోర్టులో ఓ కేసు విచారణ నిమిత్తం వాయిదాకు హాజరయ్యేందుకు వెళ్తున్న యూసుఫ్ దీదత్పై ఓ దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో యూసుఫ్ తలకు తీవ్ర గాయమైంది. దుండగుడు కాల్పులకు పాల్పడ్డ కారణం తెలియరాలేదు. ఇదిలా ఉండగా, యూసుఫ్ దీదత్ ప్రఖ్యాత ఇస్లాంమత గురువు అహ్మద్ దీదత్ కుమారుడు. ఆయన ఓ మిషనరీని నడిపించేవారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 1986లో కింగ్ ఫైజర్ అంతర్జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. 2005లో అహ్మద్ దీదత్ మృతిచెందారు. అప్పటి నుంచి మిషనరీ నిర్వహణ బాధ్యతలతో పాటు ఇస్లాం మత ప్రచారంపై యూసుఫ్ దీదత్ ప్రత్యేక దృష్టి పెట్టారు.